Donald Trump : జన్మత పౌరసత్వ హక్కుపై ట్రంప్ ఆదేశాలకు బ్రేక్

అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మత పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్ ఫెడరల్ జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ నిలిపివేశారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని ఆదేశాలిచ్చారు. దీనిపై అప్పీలుకు వీలుగా ఏడు రోజులపాటు స్టే ఇచ్చారు. ఫెడరల్ జడ్జి నిర్ణయంతో సుప్రీం కోర్టు (Supreme Court) లో ఈ కేసు విచారణ త్వరితగతిన జరగనుంది. ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతా వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించారు.