G20 Ministers: జీ20 మంత్రుల భేటీకి అమెరికా దూరం

దక్షిణాఫ్రికాలో ఈనెలలో జరిగే జీ-20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా తరపున ఎవరూ హాజరుకాబోరని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) ప్రకటించారు. ఈ నెల 20, 21 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లో జరిగే విదేశాంగ మంత్రుల జీ20 చర్చలను బహిష్కరిస్తున్నట్లు రూబియో తెలిపారు. దక్షిణాఫ్రికా (South Africa) ప్రభుత్వం అమెరికా వ్యతిరేక ఎజెండాతో వ్యవహరిస్తున్నందువల్లే సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడిరచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా గైర్హాజరు జీ20 కూటమికి పెద్దదెబ్బే. ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War)పై దౌత్యానికి ట్రంప్ మొగ్గుచూపుతున్న విదేశాంగ మంత్రుల భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో రూబియో తొలిసారిగా భేటీ అవుతారని అంతా అనుకుంటున్న వేళ అసలు అమెరికా ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిందని రూబియో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.