Ukraine: ఉక్రెయిన్ ఏదో రోజు రష్యాలో భాగం కావచ్చు : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్(Ukraine) ఏదో రోజు రష్యా (Russia)లో భాగం కావొచ్చు.. కాకపోవచ్చు అని పేర్కొన్నారు. ఆ రెండు దేశాలు ఒప్పందం చేసుకోచ్చు. చేసుకోకపోవచ్చు ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు అంటూ ట్రంప్ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం, దానికి ప్రతిగా కీవ్ (Kiev )ఆధీనంలోని అరుదైన ఖనిజ నిల్వలను అమెరికా (America)కు అప్పగించడానికి సంబంధించిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. తమకు ఖనిజాలు లభిస్తే, ఉక్రెయిన్‌కు అవసరమైన వాటిని అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. గ్రాఫైట్, లిథియం, టైటానియం, యురేనియం వంటి 17 అరుదైన, ఖరీదైన ఖనిజాలకు ఉక్రెయిన్ ప్రసిద్ధి.