Donald Trump: కార్ రేస్ ట్రాక్‌పై అమెరికా అధ్యక్షుడి బీస్ట్!

ప్రజలను ఉత్సాహపరచడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ను మించిన మాస్ లీడర్ లేరనే చెప్పాలి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకొంది. తన సొంత రాష్ట్రమైన ఫ్లోరిడా(Florida)లో ప్రతిష్ఠాత్మకంగా మొదలైన ది డేటోన(Daytona )-500 మోటర్ రేసు ప్రారంభానికి ఏకంగా అధ్యక్షుడి వాహన శ్రేణిలోని కారు ది బీస్ట్ ను కూడా పంపారు. అది ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ రెండు ల్యాప్‌లను కూడా పూర్తి చేసింది. ఆ సమయంలో ట్రంప్ తన మనవరాలు కరోలినా (Carolina)తో కలిసి అందులో ఉన్నట్లు శ్వేతసౌధం విడుదల చేసిన మీడియాను బట్టి తెలుస్తోంది. అంతేకాదు, అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One) కూడా ది డేటోన-500 మైదానం చుట్టూ ఓ మారు గాల్లో తిరిగింది. అమెరికాలోని నాస్‌కార్ ( నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్‌కార్ ఆటో రేసింగ్)లో ది డేటోన -500 అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. తాను అధ్యక్ష రేసులో రెండోసారి పోటీపడుతున్న 2020 లో కూడా డొనాల్డ్ ట్రంప్ దీనిని వీక్షించేందుకు స్వయంగా వచ్చారు.