Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు బ్రేక్

అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్దఎత్తున ఇబ్బంది తొలగింపు చేపట్టిన ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బ తలిగింది. భారీ సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగుల (Federal employees )ను తొలగిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్పస్ (William Alpus )ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి ఆధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.
ఉద్యోగుల కోతలపై ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని కార్మిక సంఘాలు (Labor unions) కోర్టును ఆశ్రయించాయి. పలు ఏజెన్సీల్లో దాదాపు ప్రొబేషనరీ సిబ్బంది మొత్తాన్నీ తొలగిస్తున్నారని, ఇది చట్ట వ్యతిరేకమని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి అల్సప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది నిర్వహణ కార్యాలయానికి తన సొంత సిబ్బందిని తొలగించే హక్కు ఉంది గానీ, ఇతర విభాగాల్లో కోతలు విధించే అధికారం లేదు. ఫెడరల్ ఏజెన్సీలే తమ విభాగాల్లో సిబ్బంది నియామకాలు, తొలగింపులు నిర్వహించుకునేలా కాంగ్రెస్ వాటికి అధికారం కల్పించింది. కోతలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చట్ట వ్యతిరేకంగా కన్పిస్తోంది అన్ని న్యాయమూర్తి పేర్కొన్నారు.