ట్రంప్ వార్నింగ్…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. భారత్ ఉత్పత్తులపై భారీ పన్ను విధిస్తానని కుండబద్దలు కొట్టారు. ఫాక్స్ బిజినెస్‌కు చెందిన లారీ కుడ్లోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్రంప్ ఆ సంచలన ప్రకటన చేశాడు. కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై, ప్రత్యేకించి హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ అధిక పన్ను విధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా భారతదేశాన్ని ‘టారిఫ్ కింగ్’గా ట్రంప్ అభివర్ణించారు. అంతేకాదు.. 2019 మే నెలలో తమ మార్కెట్లకు న్యాయమైన మార్గంలో సహేతుకమైన యాక్సెస్ ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అమెరికాలో భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చే ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్’ ను రద్దు చేశారు.






