America : అంతర్జాతీయ న్యాయస్థానంపై అమెరికా ఆంక్షలు

ఇజ్రాయెల్ దురాగతాలపై దర్యాప్తు జరుగుతున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై అమెరికా (America) ఆంక్షలు విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. గాజా (Gaza) ప్రాంతంలో జరిగిన యుద్ధనేరాలకు బాధ్యునిగా పేర్కొంటూ ఐసీసీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) కు వ్యతిరేకంగా గతంలో అరెస్టు వారెంట్లు జారీ చేసింది. 2023 అక్టోబరులో హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన ప్రతిదాడిలో పిల్లలు, మహిళలతో సహా వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కోర్టు ఆ వారెంట్లు జారీ చేసింది. ఐసీసీ అమెరికాను, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ (Israel)ను లక్ష్యంగా ఎంచుకొని న్యాయ విరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిరదని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెతన్యాహు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా ట్రంప్ ఆ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.