Donald Trump : హమాస్‌తో ఒప్పందం చేసుకోండి : డొనాల్డ్ ట్రంప్

గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని వేగంగా ముగించి సంధి కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. గాజా (Gaza)లో ఒప్పందం చేసుకోండి. బందీలను వెనక్కి తీసుకురండి అని పేర్కొన్నారు. ఆయన గతంలో ప్రతిపాదించిన కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఆమోదించాలని ఇజ్రాయెత్ ప్రధాని నెతన్యాహు (Netanyahu)పై ఒత్తిడి తెచ్చినట్లైంది. గాజాలో వచ్చేవారం సంధి కుదురుతుందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరోసారి సోషల్ మీడియా (Social media )లో పోస్టు పెట్టడం గమనార్హం. నెతన్యాహుపై కేసులను వదిలేయాలని ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్లను అభ్యర్థించిన కొన్ని గంటల్లోనే ఈ పోస్టును పెట్టడం విశేషం. ఇజ్రాయెల్ (Israel) ప్రధాని ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని ఆ ఒప్పందం కుదిరితే బందీలు వెనక్కి వస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ద సమయంలో అమెరికా అధ్యక్షుడి మద్దతుగా నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌కు సహాయన్ని కూడా అగ్ర రాజ్యం గణనీయంగా పెంచింది. వాషింగ్టన్ నుంచి ప్రపంచంలో మరే దేశానికి అంత స్థాయిలో ఆర్థిక సాయం అందలేదు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన వందల మందిని హత్య చేసింది. 251 మందిని బందీలుగా పట్టు కుపోయింది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా 49 మంది ఇప్పటికే హమాస్ చెరవలో ఉన్నట్లు భావిస్తున్నారు.