TFI: మనశంకర వరప్రసాద్.. చిరు, వెంకి రెమ్యునరేషన్లు తెలుసా
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి (మన శంకర వరప్రసాద్), విక్టరీ వెంకటేష్ ల భారీ చిత్రం ఈరోజే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెనుక ఉన్న భారీ ఆర్థిక లెక్కలు ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
భారీ బడ్జెట్ తో గ్రాండ్ మేకింగ్
ఈ చిత్రాన్ని నిర్మాతలు దాదాపు 225 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించారు. కేవలం స్క్రీన్ పై కనిపించే గ్రాండియర్ కోసమే కాకుండా, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాల కోసం సుమారు 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండటానికి ఈ భారీ బడ్జెటే కారణం.
నటీనటుల పారితోషికాల వివరాలు…
చిరంజీవి: మెగాస్టార్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా కోసం ఆయన సుమారు 70 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో ముందుగా అనుకున్న లెక్కల ప్రకారం.. లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉండనుంది.
వెంకటేష్: ఈ సినిమాలో సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించిన వెంకటేష్ 22 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్లు: సినిమాలో కీలక పాత్రల్లో నటించిన నయనతార, ఇతర హీరోయిన్ల కోసం నిర్మాతలు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వీరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు కొత్త గ్లామర్ తీసుకొచ్చింది.
ఇతర తారాగణం: సినిమాలో నటించిన ఇతర ప్రముఖ నటులు, కమెడియన్లు, విలన్ పాత్రధారుల పారితోషికాలు కలిపి మరో 15 కోట్లకు పైగానే ఖర్చయ్యాయి.
టెక్నీషియన్ల ఖర్చు, ఇతర వ్యయాలు: టాప్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ల కోసం రూ.10 కోట్లు, అలాగే పబ్లిసిటీ, ప్రమోషన్ల కోసం మరో 15 కోట్లు కేటాయించారు. సినిమా విడుదలైన మొదటి రోజే వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, మొదటి వారంలోనే సగానికి పైగా బడ్జెట్ రికవరీ అయ్యేలా కనిపిస్తోంది. థియేట్రికల్ హక్కులు ఇప్పటికే 180 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. మొత్తానికి మన శంకర వరప్రసాద్ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.






