Donald Trump: ఇలాంటివి ఎప్పుడూ విజయవంతం కాలేదు : డొనాల్డ్ ట్రంప్

అమెరికాలో కొత్త పార్టీ పెట్టిన ఎలాన్ మస్క్ (Elon Musk )పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మస్క్ నిర్ణయం హాస్యాస్పదమైనదని, ఆయన పూర్తిగా దారి తప్పాడని నిప్పులు చెరిగారు. అమెరికాలో రిపబ్లికన్(Republican), డెమోక్రటిక్ (Democratic) పార్టీలతో పోటీ పడేందుకు అమెరికన్ పార్టీని పెట్టినట్టు మస్క్ ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అమెరికాలో ఎప్పటి నుంచో రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతున్నదని, ఇప్పుడు మస్క్ మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళాన్ని సృష్టించడమే తప్ప మరొకటి కాదని, ఇలాంటివి ఎప్పుడూ విజయవంతం కాలేదని అన్నారు. గత ఐదు వారాలుగా మస్క్ పూర్తిగా దారి తప్పడం, ముఖ్యంగా ట్రైన్ వ్రెకర్‌గా మారడం బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు.