English: అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్ : ట్రంప్

అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్ (English )ను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) , సంస్థలు (Organizations) ఇకపై తమ పత్రాలు, సేవలను వినియోగదారులకు ఇంగ్లిషేతర భాషల్లో అందించాలా వద్ద అన్నది నిర్ణయించుకోవచ్చు. బిల్ క్లింటన్ (Bill Clinton) అధ్యక్షుడిగా ఉన్నపుడు ఇంగ్లిష్ మాతృభాష కాని వ్యక్తులకు ఈ సంస్థలు ఆయా భాషల్లో సేవలు అందించడం తప్పనిసరి చేస్తూ ఓ ఉత్తర్వును తీసుకొచ్చారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆ ఉత్తర్వును రద్దు చేసినట్లైంది.