Donald Trump : ఆ రెండు దేశాలపై సుంకాల మోత : ఆగస్టు 1 నుంచి అమల్లోకి

ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్(Japan), దక్షిణ కొరియా(South Korea) లపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఈ రెండు దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తూ లేఖలను విడుదల చేశారు. ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోరి రానున్నాయి. రెండు దేశాలు ప్రతీకార సుంకాలను పెంచవద్దని, అలా చేస్తే వారి ఆటోమొబైల్ (Automobile), ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు (Electronics industries) దెబ్బతింటాయని హెచ్చరించారు. మీరు ఏ కారణాల వల్ల సుంకాలను పెంచినా ఇప్పుడు మేం విధించిన 25 శాతానికి అదనంగా ఆ సుంకాలను వేస్తాం అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మిగిలిన దేశాలకూ ప్రతీకార సుంకాల గడువును ఆగస్టు 1 వరకూ పొడిగించారు.