Donald Trump: చైనాతో ఒప్పందం కుదిరింది… త్వరలో భారత్‌తోనూ

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, భారత్ (India)లోనూ అతి త్వరలో భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలోనే చైనా (China)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ (Howard Lutnick) తెలిపారు. అయితే చైనాతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను ట్రంప్, లట్నిక్ వెల్లడిరచలేదు. చైనాతో ఒప్పందం కుదరింది అని మాత్రమే ట్రంప్ తెలిపారు. రెండు రోజులు ముందే ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయని లట్నిక్ పేర్కొన్నారు. చైనా నుంచి రేర్ ఎర్త్‌మ్యాగ్నెట్‌లు, రేర్ ఎర్త్ మినరల్స్‌ను అమెరికా పరిశ్రమలు సులభంగా పొందే విధంగా చేస్తానని రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించారు. అది మినహా తాజా ఒప్పందంలో ఏయే అంశాలు ఉన్నాయో స్పష్టత ఇవ్వలేదు. భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో గణనీయ పురోగతి ఉందని ఆయన సంకేతాలిచ్చారు. త్వరలోనే గొప్ప ఒప్పందాలు రానున్నాయి. ఇందులో భారత్‌తో కూడా ఒకటి కుదరనుంది అని వైట్ హౌస్ (White House )లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ పేర్కొన్నారు.