అమెరికా ఉపాధ్యక్ష పదవికి వివేక్ రామస్వామి!
అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్షుడిగా ఎంపిక కాగల అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నారు. వారిలో భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా ఉండటం విశేషం. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం తనతో పోటీపడుతున్న మరో భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ పేరును ట్రంప్ ప్రస్తావించలేదు. ట్రంప్ ఆరుగురి పేర్లను ప్రస్తావించారు. వారిలో రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, సౌత్ కరోలినా సెనెటర్ టిమ్ స్కాట్, హవాయికి చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాలు తులసీ గబ్బర్డ్, ఫ్లోరిడా ఎం.పి. బైరన్ డొనాల్డ్స్, దక్షిణ డకోటా రాష్ట్ర గవర్నర్ క్రిస్టీ నోయెమ్ ఉన్నారు.






