Donald Trump: గడువుకన్నా ముందే.. ప్రపంచదేశాలకు: డొనాల్డ్ ట్రంప్

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల వివరాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయా దేశాలకు లేఖలు రాస్తున్నారు. అమెరికాతో ఒప్పందాలకు జులై 9వరకు గడువు ఉన్నా, అంతకంటే ముందే కొత్త టారిఫ్ రేట్ల (New tariff rates)ను పేర్కొంటూ లేఖలు (Letters) రాస్తున్నారు.శుక్రవారం నుంచి తమ వాణిజ్య భాగస్వాములకు ఈ లేఖలను పంపుతామని ఆయన ప్రకటించారు.
అమెరికాతో వాణిజ్యం చేయాలంటే సుంకాలు ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నాం. శుక్రవారం నుంచి నుంచి రోజుకు 10 దేశాల చొప్పున వీటిని పంపిస్తాం అని ఆయన విలేకరులకు చెప్పారు. టారిఫ్‌లపై ఉన్న డెడ్‌లైన్‌ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్(India), చైనా(China) సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అనంతరం ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు గడువు (జులై 9వ తేదీ వరకు) విధిస్తూ సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.