Donald Trump : కెనడాపై 35 శాతం సుంకాలు : ట్రంప్

పొరుగు దేశం కెనడా (Canada) నుంచి దిగుమతయ్యే సరకులపై 35 శాతం సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురనుందన్నవార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన (Advertisement) చేయడం గమనార్హం. వచ్చే నెల ఒకటి నుంచి ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) కి లేఖ రాశారు. తమతో కలిసి పనిచేయడానికి బదులు కెనడా ప్రతీకార సుంకాలు (Tariffs) విధిస్తున్నదని అందులో మండిపడ్డారు.