Trump : కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు

అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే 25 శాతం సుంకాలతో కెనడా (Canada) పై విరుచుకుపడిన ట్రంప్ (Trump), తాజాగా ఉక్కు(Steel) , అల్యూమినియం (aluminum)పై 50శాతానికి పెంచుతానని ప్రకటించారు. బుధవారం నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడిరచారు. విద్యుత్‌పై సుంకాలను విధిస్తామని ఆంటారియో (Ontario) ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 25 శాతమున్న సుంకాలను 50 శాతానికి పెంచాలని మా వాణిజ్య మంత్రిని ఆదేశించా. కెనడా నుంచి వచ్చే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఈ సుంకాలు బుధవారం నుంచి అమలవుతాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలున్న దేశం కెనడా అని ట్రంప్ పేర్కొన్నారు.