Elon Musk :మస్క్‌కు మరింత అధికారం!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk )కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump ) మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. ఈ మేరకు ఆయన నిర్వహిస్తున్న డోజ్ (Doze) విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై తాజాగా సంతకం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉండనున్నాయి. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు (Federal agencies) డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో ట్రంప్ ఆదేశించారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ డోజ్ పని తీరును ప్రశంసించారు. దావాలను పట్టించుకోకుండా డోజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని మస్క్‌కు సూచించారు.