Donald Trump: ట్రంప్ కోతల ఎఫెక్ట్ … ఈసారి విద్యాశాఖపై

అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచీ ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టి సారించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కన్ను ఈసారి విద్యాశాఖపై పడిరది. ఈ శాఖలోని పలు కీలక విభాగాల్లో కోతలు ప్రకటించారు. సిబ్బందిని సగానికి తొలగించే ప్రయత్నాలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మాన్ (Linda McMahon ) బాధ్యతలు స్వీకరించిన అయిదు రోజుల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ట్రంప్ నాకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేసేందుకు మేము కాంగ్రెస్ (Congress) తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించి ఉన్నవారిపై కత్తెర వేయడం కిందికే వస్తుంది అని లిండా పేర్కొన్నారు. అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని, ఈ శాఖను తొలగించి రాష్ట్రాలకు అప్పగిస్తానని అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛంద పదవీ విరమణకు ముందుకొచ్చారు. అలాగే విద్యాసంస్థ (Educational institution) ల్లో ఆందోళనలపై కఠినంగా వ్యవహరిస్తామని సైతం ట్రంప్ హెచ్చరించారు.