Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన.. బ్రిక్స్ అనుకూల దేశాలపై

వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ (Bricks) అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు (Tariffs) విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు అని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రెజిల్ (Brazil) వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రియో డి జనీరో నగరంలో ఈ సదస్సు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని మోదీ (Modi) సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది.