Hamas: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన .. అవసరమైతే షరతులకు

గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అవసరమైన షరతులకు ఇజ్రాయెల్(Israel) అంగీకరించిందని , దీనికి హమాస్ (Hamas) కూడా ఒప్పుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. ట్రంప్ ప్రతిపాదనపై ఇజ్రాయెల్, హమాస్‌లు తమ తమ పాత వైఖరులనే పునరుద్ఘాటిస్తూ పరస్పరం భిన్నంగా ప్రతిస్పందించాయి. కాల్పులు విరమణ ఒప్పందానికి సిద్ధమేనని తెలిపిన హమాస్ గాజా (Gaza)పై యుద్ధాన్ని శాశ్వతంగా ఇజ్రాయెల్ ముగిస్తామంటేనే సంధి చేసుకుంటామని స్పష్టం చేసింది. గాజా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైనం పూర్తిగా వెనక్కి వెళితే దానికి బదులుగా మిగిలిన 50 మంది బందీలను విడుదల చేస్తామని తీవ్రవాద సంస్థ ప్రతినిధి తాహెర్ అల్ నును తెలిపారు. యుద్ధాన్ని ముగిస్తామంటే చర్చలకు సిద్ధమేనని వెల్లడిరచారు. అయితే ఆయుధాలు అప్పగించి హమాస్ లొంగిపోవాలని, పాలస్తీనాను వీడి వెళ్లిపోవటానికి అంగీకరిస్తేనే 60 రోజులు కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. యుద్దానంతరం గాజాలో హమాస్ కనిపించడానికి వీల్లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) స్పష్టం చేశారు.