Ukraine ఉక్రెయిన్-అమెరికా మధ్య ఒప్పందం …ట్రంప్‌తో

విస్తృత ఒప్పందం కుదుర్చుకునే దిశగా అమెరికా- ఉక్రెయిన్ అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక ఒడంబడికపై సంతకాలు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ (Ukraine) వర్గాలు వెల్లడిరచాయి. రష్యా(Russia) -ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఖనిజాలతోపాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా (America) కోరుతోంది. తొలుత దీనికి అంగీకరించని ఉక్రెయిన్, తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ ఆశిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) శుక్రవారం ట్రంప్‌తో భేటీ కానున్నారు. జెలెన్‌స్కీ తనను కలవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, నచ్చితే ఒప్పందంపైనా ఆయన సంతకం చేయవచ్చని ట్రంప్ మీడియాతో అన్నారు. ఒడంబడిక విలువ లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు.