Saudi Arabia :సౌదీలో పుతిన్‌తో ట్రంప్ భేటీ ?

శాంతి చర్చల కోసం తాను రష్యా అధినేత పుతిన్‌తో సౌదీ అరేబియా (Saudi Arabia ) లో భేటీ కావచ్చని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఖరారు కాలేదని, అలాగని ఈ భేటీలో జాప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజూ (Prince) భాగం కావచ్చని వెల్లడిరచారు. అయితే ఈ శాంతి చర్చల్లో నాటో (NATO) లోని ఐరోపా దేశాలకు భాగస్వామ్యం కల్పించే విషయంలో అమెరికా ఆసక్తి చూపడం లేదు. ఉక్రెయిన్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. పుతిన్ (Putin)తో 90 నిమిషాలపాటు సుదీర్ఘంగా ఫోన్‌ల మాట్లాడిన తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రష్యా ఆక్రమణలో ఉన్న భూభాగాలనూ ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ట్రంప్ రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించారని తెలిపారు.