Federal agencies : ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ సర్కారు ఆదేశం

అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్న ట్రంప్ (Trump) సర్కారు, భారీగా ఉద్యోగుల (Employees)ను తొలగించడంతోపాటు పోస్టుల రద్దు పైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మార్చి 13వ తేదీలోగా పోస్టుల రద్దు ప్రణాళికలను అందజేయాలని ఫెడరల్ ఏజెన్సీల (Federal agencies ) ను ఆదేశించింది. ఈ మేరకు ట్రంప్ అధికార యంత్రాంగం మెమో (Memo) జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వంలోని వేల మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించిన ట్రంప్ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులపైనా, వారి పోస్టులపైనా దృష్టి సారించింది.