భారత్, అమెరికా సంబంధాలు మరింత విస్తృతం : గార్సెట్టీ
భారత్, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా ఉన్నాయని, అవి మరింత విస్తృతవుతున్నాయని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఇంత దగ్గరగా రెండు దేశాలు లేవని, అమెరికాలో భారతీయులు 1.5 శాతం ఉన్నారని, వారు దేశ పన్నుల్లో 6 శాతం చెల్లిస్తున్నారని తెలిపారు. అమెరికాలో భారతీయులు అత్యంత విజయవంతమైన వలస వర్గమని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి భారీగా తరలివచ్చిన ప్రతినిధులతో వాషింగ్టన్కు సమీపంలోని ఆక్సన్ హిల్లో నిర్వహించిన సెలక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. భారత్, అమెరికా సంబంధాలంటే కూడిక కాదు.. మల్టిప్లికేషన్. ఇది అమెరికా ప్లస్ ఇండియా కాదు. గుణింతం లాంటిది అని గార్సెట్టీ పేర్కొన్నారు. అమెరికన్లకు మరిన్ని భారత్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.






