Sudiksha konan : భారత సంతతి విద్యార్థిని అదృశ్యం

విహార యాత్రలో భాగంగా స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్లిన ఓ భారత సంతతి విద్యార్థిని అదృశ్యమైంది. అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ (University of Pittsburgh)లో చదువుతున్న సుదీక్ష కోణంకి (Sudiksha konan) ( 20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ బీచ్ వద్ద కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. సుదీక్ష వర్జీనియా (Virginia)లో నివాసం ఉంటున్నారు. గతవారం మరో ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లికన్ ప్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. ఈ నెల 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసుల (Police)ను సంప్రదించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపుచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు. భారత్ (India) కు చెందిన సుదీక్ష తల్లిండ్రులు అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు.