Donald Trump : ట్రంప్‌పై దాడి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైఫల్యమే

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల ఘటనకు సీక్రెట్ సర్వీస్ (Secret Service) ఏజెంట్ల వైఫల్యమే కారణమని తేలింది. ఈ క్రమంలో నాడు విధుల్లో ఉన్న ఆరుగురిని సస్పెండు చేస్తూ సీక్రెట్ సర్వీస్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్విన్ (Matt Quinn) వెల్లడిరచారు. వీరందరినీ భవిష్యత్తులో కీలక విధులకు దూరంగా ఉంచుతామని తెలిపారు. బట్లర్ (Butler) లో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత సీక్రెట్ సర్వీస్‌దేనని స్పష్టం చేశారు.