Donald Trump :పుతిన్ నియంత కాదు : ట్రంప్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నియంత అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ (Putin)ను నియంతగా భావిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron )తో భేటీ అనంతరం సంయుక్తగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్ (Ukraine)లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అని వ్యాఖ్యానించారు.