Donald Trump: కాల్పుల విరమణపై పుతిన్ సాగదీత : ట్రంప్

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కావాలనే సాగదీస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని రష్యా (Russia) తారుమారు చేస్తోందని ఆరోపించారు. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా కోరుకుంటోందని నేను అరుకుంటున్నా. కానీ ఇప్పుడు వారి కాళ్లను వారే లాక్కుంటున్నారని అనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ పుతిన్ ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మారణ హోమాన్ని నేను ఆపాలనుకుంటున్నా. ఉక్రెయిన్ (Ukraine) కు అందిస్తున్న ఆర్థిక సాయానికి ముగింపు పలకాలనుకుంటున్నా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.