స్పీకర్ ఛాంబర్ లో నిరసనకారుడి హంగామా
అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకుకెళ్లిన ట్రంప్ అభిమానులు తెగ హంగామా చేశారు. ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఏకంగా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆఫీసు రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న స్పీకర్ డెస్క్‌పై కూర్చుని దర్జాగా తన నిరసన తెలిపాడు. పెలోసి ఛాంబర్లోని చైర్లో కూర్చున్న నిరసనకారుడు.. తాము వెనక్కి వెళ్లేది లేదంటూ అక్కడ నుంచే తన మొబైల్లో మెసేజ్ కూడా చేశారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సేనేట్ సభ్యులు ఉండే క్యాపిటల్ హిల్‌లోకి ట్రంప్ అభిమానులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కొందరు నిరసనకారులు బాడీ ఆర్మర్‌తో లోపలికి వచ్చినట్లు వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీసు చీఫ్ రాబర్ట్ కాంటీ తెలిపారు. పోలీసులపై దాడి చేసేందుకు ట్రంప్ అభిమానులు కెమికల్స్ వాడినట్లు కూడా అనుమానిస్తున్నారు.






