Narendra Modi: ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ

అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రపంచ కుబేరుడు, డోజ్ సారథి ఎలాన్ మస్క్(Elon Musk) తో భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్ (Blair House )లో తన సహజీవన భాగస్వామి షివోన్ జిలిస్ (Shivonne Zilis) , ముగ్గురు పిల్లలతో మోదీని కలిశారు. ఈ సంద్భంగా టెస్లా అధినేత పిల్లలకు ప్రధాని కొన్ని పుస్తకాలను బహుమతులుగా ఇచ్చారు. వీటిలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ది క్రెసెంట్ మూన్ (The Crescent Moon), విష్ణుశర్మ రచించిన పంచతంత్ర (Panchatantra), ఆర్‌కే నారాయణ్ పుస్తకాలు ఉన్నాయి. మస్‌తో సమావేశంలో స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్థిరమైన అభివృద్ధి మొదలైన విషయాల్లో భారత్ యూఎస్‌కు చెందిన సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించినట్లు ప్రధాని వెల్లడిరచారు.