America: పాక్ దౌత్యవేత్తను అడ్డుకున్న అమెరికా

తుర్క్‌మెనిస్థాన్‌లో పాకిస్థాన్ (Pakistan) దౌత్యాధికారిగా పనిచేస్తున్న అధికారిని అమెరికా(America) తన భూభాగంలోకి అడుగుపెట్టనీయకుండా తిప్పి పంపింది. దౌత్యవేత్త కె.కె. వాగన్ (K.K. Wagon) వద్ద వీసాతో పాటు అవసరమైన అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ అమెరికా ఈ చర్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఆయన ఇమిగ్రేషన్ (Immigration) పై అభ్యంతరాలున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. లాస్‌ఏంజెలెస్ (Los Angeles) లోకి వాగన్ ప్రవేశించిన వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిప్పి పంపారు. దౌత్యవేత్త వ్యక్తిగత పనిమీద అమెరికా వెళ్లినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. వీసాల జారీకి సంబంధించి ఆయన చేసిన సిఫార్సుల వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.