Big Beautiful Bill :అమెరికా పార్లమెంటు లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం

డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big Beautiful Bill) పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రిపబ్లికన్ సభ్యులు (Republican members), అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ బిల్లుపై ఆయన సంతకం చేశశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్‌లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్‌లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51`50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు.