Harvard University: హార్వర్డ్ సదస్సులో నీతా అంబానీ కీలకోపన్యాసం

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University )లో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక వార్షిక భారత సదస్సులో రిలయన్స్ ఫౌండేషన్స్ చైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కీలకోపన్యాసం చేయనున్నారు. భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి వంటి అంశాలపై ఆమె మాట్లాడతారు. ప్రముఖ విద్యావేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా (Nitin Nohria )తో చర్చల్లోనూ నీతా అంబానీ పాల్గొంటారు. ఆధునిక ప్రపంచంలో భారత కళలు, సంస్కృతిలోని వివిధ కోణాలు, అవి పోషించే గణనీయమైన పాత్రపై ఈ చర్చ ఉంటుంది. సదస్సుకు వెయ్యిమందికి పైగా ప్రతినిధులు(Representatives) హాజరయ్యే అవకాశముంది.