Donald Trump:డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు .. ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గినట్లేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మస్క్‌ను దేశం నుంచి బహిష్కరించే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మస్క్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మస్క్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారా అని ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన పరిశీలిస్తున్నామని బదులిచ్చారు. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడిన వీడియో (Video)ను మస్క్ పోస్టు చేశారు. దీనిని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉంది. కానీ ప్రస్తుతం ఏమీ చేయదల్చుకోలేదు అని మస్క్ పేర్కొన్నారు. దీంతో ఆయన వెనక్కి (Back) తగినట్లు భావిస్తున్నారు.