Donald Trump : డొనాల్డ్ ట్రంప్ కీలక సమావేశంలో.. అనూహ్య సంఘటన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షతన జరుగుతున్న అత్యంత కీలక సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ భేటీ జరుగుతుండగా మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) అనుకోకుండా ఓవల్ కార్యాలయం (Oval Office) లోపలికి వచ్చేశారు. దీంతో సిబ్బంది ఆయనను బయటకు పంపించారు. అమెరికా ఆరోతరం ఫైటర్ జెట్లు (Fighter jets) అయిన ఎఫ్-47 స్టెల్త్ యుద్ధ విమానాలపై కొన్ని నెలల క్రితం ట్రంప్ అత్యంత రహస్య సమావేశం నిర్వహించారు. ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ యుద్ధ విమానాల సామర్థ్యం గురించి అధికారులు, అధ్యక్షుడికి వివరిస్తుండగా, ఉన్నట్టుండి జుకర్‌బర్గ్ లోపలికి వచ్చేశారు. ఆయనను చూసి సైనికాధికారులు షాక్ అయ్యారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా బయటకు వెళ్లమని చెప్పారు. దీంతో ఆయన అధ్యక్షుడిని పలకరించి గది నుంచి బయటకు వచ్చేశారు.