వారిపై దాడులు చేస్తే సహించబోం : జో బైడెన్
ఆసియా-అమెరికన్లపై దాడులు, హింస, వివక్షత (జెనోఫోబియా)కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అదనపు చర్యలకు ఉపక్రమించారు. ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపకల్పవాసులపై జరుగుతున్న జాత్యంహకార దాడులపై ఇక ఉపేక్షించేది లేదని బైడెన్ ట్వీట్ చేశారు. వారిపై జరుగుతున్న దాడులను పరిష్కరించేందుకు, హింసాత్మకతపై తమ ప్రతిస్పందనగా వీటిపై న్యాయశాఖ జోక్యంతో పాటు అదనపు చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ఈ దాడులు తప్పని ఇది అమెరికా నైజం కాదని, ఇటువంటి వాటిని తప్పక ఆపాలని హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా రెస్యూ ఫ్లాన్ కింద 49.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ఈ ప్లాన్ కింద గృహ హింస, లైంగిక వేధింపులు నుండి బయటపడిన వారితో పాటు భాష రాకపోవడం వంటి అదనపు అడ్డంకులను ఎదుర్కొనే కార్యక్రమాల కోసం కూడా ఈ నగదును వినియోగిస్తారు. ఈ దాడులను గతంలోనే ఖండించిన ఆయన ఇటువంటి దాడులను కచ్చితంగా నిలువరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.






