Paul Kapoor: డొనాల్డ్ ట్రంప్ బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్ (Paul Kapoor )ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లు(Donald Lu) స్థానంలో పాల్‌కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు.