Zohran Mamdani : న్యూయార్క్ మేయర్గా మమ్దానీ
అమెరికాలోని న్యూయార్క్(New York) నగర మేయర్గా భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ఘన విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి అయిన మమ్దానీని ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం గమనార్హం. 34 ఏళ్ల మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ అయిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ అమెరికన్ ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. జనవరి 1న మేయర్ (Mayor) గా బాధ్యతలు చేపట్టనున్నారు.







