Donald Trump: భారత్‌తో అటువంటి ఒప్పందమే : డొనాల్డ్ ట్రంప్

ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం తరహాలోనే భారత్ (India)తోనూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నా మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. అమెరికా(America )- ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం ..అమెరికా ఉత్పత్తులకు ఇండోనేషియా (Indonesia) పూర్తి స్థాయిలో తలుపులు బార్లా తెరుస్తుంది. ఇండోనేషియా వస్తువులకు అమెరికాలో 19 శాతం టారిఫ్ వర్తిస్తుంది. 15 బిలియన్ డాలర్ల అమెరికా ఇంధనాన్ని 4.5 బి.డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను, 50 బోయింగ్ విమానాల (Boeing aircraft)ను ఇండోనేషియా కొనుగోలు చేస్తుంది. భారత్‌లోనూ మా వస్తువులను తలుపులు తెరుచుకుంటాయి. ఈ దేశాలకు ఇది వరకు మా వాళ్లు వెళ్లలేకపోయేవారు. ఇపుడు నేను విధించిన టారిఫ్‌లతో, మావాళ్లు వెళ్లేలా చేస్తున్నా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై మేధో సంస్థ జీటీఆర్‌ఐ స్పందిస్తూ భారత్ కనుక అటువంటి ఒప్పందాన్ని అంగీకరిస్తే దేశీయ రంగాలకు ఇబ్బందే. ముఖ్యంగా వ్యవసాయ, డెయిరీ రంగాలకు ప్రమాదం. ప్రతిఫలంగా మనకు దక్కేది చాలా తక్కువ. భారత టారిఫ్‌లను తొలగించే, పరస్పర ప్రయోజనాల్లేని ప్రతికూల ఒప్పందం చేసుకోవడం కంటే, ఎటువంటి ఒప్పందమూ లేకపోవడమే మంచిదని పేర్కొంది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ( బీటీఏ)పై వాషింగ్టన్‌లో భారత బృందం అయిదో దశ చర్చలను నిర్వహిస్తోంది.