America :అమెరికాలో నక్కిన గ్యాంగ్‌స్టర్లు .. జాబితా సిద్ధం చేసిన భారత్

ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అమెరికా (America) లో నక్కి భారత్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ల (Gangsters)ను తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా సిద్ధం చేసిన గ్యాంగ్‌స్టర్ల జాబితాను అగ్ర దేశానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భద్రతా ఏజెన్సీలు ఓ నివేదిక రూపొందించాయని సమాచారం. గోల్డీ బ్రార్(Goldie Brar), అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi ) (సహా జాతీయ దర్యాప్తు సంస్థ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.