California : కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి.. ఖండిరచిన భారత్

అమెరికాలోని కాలిఫోర్నియా (California) లో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినోహిల్స్‌లో బొచసత్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ ( బీఏపీఎస్)కు చెందిన స్వామి నారాయణ్ మందిరం (Swami Narayan Temple )పై గ్రాఫిటీతో గుర్తుతెలియని వ్యక్తులు భారత్ (India) వ్యతిరేక రాతలు రాశారు. ఈ విషయాన్ని బీఏపీఎస్ ఎక్స్ వేదికగా వెల్లడిరచింది. ఈ దుశ్చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిరచింది. కాలిఫోర్నియా చినో హిల్స్ (Chino Hills ) లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రార్థనా స్థలాలకు తగిన భద్రతను కల్పించాలని కోరుతున్నాం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు.