ప్రేమ గెలవాలి.. ద్వేషం ఓడాలి : మెలనియా ట్రంప్
ప్రపంచంలో ద్వేషాన్ని ఓడించి ప్రేమని గెలిపించేలా చూడాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలనియా ట్రంప్ పిలుపునిచ్చారు. తన భర్తపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆమె ఈ మేరకు స్పందించారు. పరస్పర గౌరవం పరమావధిగా ఉండే ప్రపంచాన్ని మనమంతా కోరుకుంటున్నాం. కుటుంబానికి ప్రాధాన్యమిస్తూ ప్రేమ పరిఢవిల్లేలా ఆ ప్రపంచం ఉండాలి. ఈ ప్రపంచాన్ని మనం మళ్లీ సాకారం చేసుకోగలం. దానికోసం మనలో ప్రతిక్కరూ పట్టుబట్టాలి. మన బంధాలకు పునాదిరాయిలా గౌరవం నిలిచేలా చూడాలి. ప్రాణాలు పణంగా పెట్టి నా భర్తను ఈ రోజు రక్షించినందుకు భద్రత బలగాలకు ధన్యవాదాలు. దాడి దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నా మదిలో సహకర అమెరికా వాసులే మెదిలారు. మా జీవితాలు ఏమిటవుతాయనే ఆలోచన ఒక్కక్షణం పాటు వచ్చింది. రాజకీయ విభేదాలకు అతీతంగా అంతా మాకు సంఫీుభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.






