Donald Trump : ఇరాన్‌తో చర్చలకు రెడీ : ట్రంప్

ఇరాన్‌తో అణు ఒప్పందంపై తిరిగి చర్చలకు తాను సిద్ధమంటూ ఇరాన్ నాయకత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఒక లేఖ రాశారు. తన ప్రతిపాదనకు ఇరాన్ (Iran) నాయకత్వం అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంపై సమీక్ష జరిపి కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇరాన్‌కే ఎక్కువ ప్రయోజనకరమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయాలకు గురించి కూడా ఇరాన్ నాయకత్వం ఆలోచించాలని కోరుతూ, మరో అణ్వస్త్రాన్ని మీరు తయారు చేయలేరని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీ (Ayatollah Khamenei )ని ఉద్దేశించి ట్రంప్ రాశారు. ఈ లేఖపై స్పందించేందుకు వైట్‌హౌస్ (White House) సుముఖత చూపలేదు.