చైనా కంపెనీలపై డొనాల్డ్ ట్రంప్ కొరడా
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి త్వరలో వైదొలగనున్న డొనాల్డ్ ట్రంప్.. మరికొన్ని చైనా కంపెనీలపై కొరడా ఝుళిపించారు. చైనా సైనిక దళంతో సంబంధాలు నెరపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియామీ, చైనా నేషనల్ ఆఫ్‌షోర్ ఆయిల్ కంపెనీ నూక్, ప్రభుత్వం రంగంలోని విమాన తయారీ సంస్థ కొమాక్ (కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా)తో పాటు చైనా ప్రభుత్వ ఆధీనంలోని మరో కంపెనీ స్కైరిజాన్ ను బ్లాక్‌లిస్టులో పెట్టారు. వాటిలో అమెరికా పెట్టుబడులను నిషేధించారు. ఇదేవిధమైన అభియోగాలను ఎదుర్కొంటున్న దాదాపు 60 చైనా కంపెనీలను ట్రంప్ గత నెల బ్లాక్‌లిస్టులో పెట్టారు.






