Donald Trump :ఒబామా చాలా బాగున్నాడు.. నేను దరిద్రంగా కనిపిస్తున్నా : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ఆహార్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇటీవల ఆయనకు ఓ చిత్రం ఆగ్రహం తెప్పించింది. పైగా దానిని ఓ రాష్ట్ర గవర్నర్ చట్టసభలో అలంకరించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆ చిత్రాన్ని తొలగించాలని ఆయన సూచించారు. అంతేకాదు సదరు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా దానిని అక్కడ ఏర్పాటు చేశారని ఆరోపించారు. కొలరాడో (Colorado) రాష్ట్ర రాజధాని భవనంలో మిగిలిన అధ్యక్షుల చిత్రాలతో పాటు నా చెత్త చిత్రాన్ని ఏర్పాటు చేశారు. నా భవిష్యత్తులో కూడా అంత చెత్త చిత్రాన్ని నేను చూడనేమో. అదే ఆర్టిస్ట్ ఒబామా (Obama) చిత్రాన్ని కూడా గీశారు. అది అద్భుతంగా వచ్చింది. కానీ నా చిత్రం మాత్రం నిజంగా అత్యంత చెత్తగా ఉంది. ఆమె వృద్ధురాలు కావడంతో తన ప్రతిభను కోల్పోయినట్లు ఉంది. అక్కడ జరిగే ఏ కార్యక్రమంలోనైనా నా ఫొటో లేకపోయినా ఏమీ అనుకోను కానీ, ఇలాంటిది మాత్రం ఉంచటాన్ని ఇష్టపడను. కొలరాడో నుంచి చాలామంది ఫోన్లు చేసి ఫిర్యాదు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆ చిత్రాన్ని సారా బోర్డ్‌మన్ (Sarah Boardman ) అనే చిత్రకారిణి గీశారు.