Donald Trump : భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం : ట్రంప్

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. మేం బ్రిటన్ (Britain)తో ఒప్పందం చేసుకున్నాం. చైనా (China) తో చేసుకున్నాం. భారత్ (India)తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నాం అని పేర్కొన్నారు. ఇతర దేశాలతోనూ చర్చలు జరిపామని, అయితే వాటితో ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపించడం లేదని వెల్లడిరచారు. అందుకే వారికి ప్రతీకార సుంకాల విధింపు లేఖలను పంపుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా పలు దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఆయా దేశాలకు లేఖలను పంపారు. ఇందులో బంగ్లాదేశ్ (Bangladesh)పై 35 శాతం సుంకం విధించారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 నుంచి పొడిగించడంతో పాటు దేశాలకు లేఖలను పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందానికి రాని దేశాలకు సుంకాలకు సంబంధించిన లేఖలు పంపుతున్నాం. మీరు మాతో ఆటలాడాలనుకుంటే ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని స్పష్టం చేశారు.