Doze : ఓటింగ్ శాతం పెంచేందుకు భారత్‌కిచ్చే నిధులు నిలిపివేసిన డోజ్

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఏర్పడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) (Doze) విభాగం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వివిధ దేశాలకు అమెరికా(America) అందించే నిధులకు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ (India) లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందించే 2.1 కోట్ల డాలర్లను రద్దు చేసినట్లు డోజ్ వెల్లడిరచింది. బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ స్థిరత్వాన్ని పెంచేందుకు అందిస్తున్న 2.9 కోట్ల డాలర్లకు కూడా కోత విధించింది. ఇక నేపాల్ (Nepal), కంబోడియా(Cambodia) , ఆసియాలోని పలు దేశాలకు కూడా వివిధ రూపాల్లో అమెరికా అందించే సాయాన్ని నిలిపివేశారు.