Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఆకస్మికంగా అమెరికా (America)కు బయలుదేరారు. మే 8 వరకు ఆయన అక్కడే ఉండి యూఎస్ అధికారుల (US officials ) తో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఆకస్మిక అమెరికా పర్యటనపై పూర్తి వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచలేదు.