రష్యాకు వార్నింగ్ ఇచ్చిన బ్లింకెన్
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్గాన్నైనా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంథోని బ్లింకెన్ రష్యాకు హెచ్చరిక చేశారు. ఈ మేరకు ఆయన రష్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాంటి దారి ఎంచుకోవాలో రష్యానే నిర్ణయించుకోవాలన్నారు. రష్యా చర్యలపై యూఎస్, మిత్రపక్షాల ఆందోళనను వివరించామని, రష్యా వెలిబుచ్చిన సందేహాలకు సమాధానమిచ్చామని తెలిపారు. సమస్య పరిష్కారానికి తమవద్ద ఉన్న పరిష్కారాలను సూచించామని తెలిపారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడడం సహా దేశాల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్, యూరప్ మిత్రపక్షాలకు సంప్రదించి ఈ లేఖ రాసినట్లు బ్లింకెన్ తెలిపారు. అనంతరం ఆయన ఈ విషయాలను కాంగ్రెస్ లీడర్లకు వివరించారు. నాటో తరపున రష్యాకు మరో సందేశాన్ని విడిగా పంపినట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్స్టాల్టెన్బర్గ్ తెలిపారు.






